మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి

కంచిలి మండలంలోని నువ్వాగడ, పెద్దశ్రీరాంపురం పంచాయతీల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి పరామర్శించారు. ఆయా కుటుంబాలను స్వయంగా కలిసి మృతుల వివరాలను తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి సానుభూతి తెలిపారు.

నువ్వాగడ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు దుప్పుల కోదండరావు తల్లి దుప్పుల బంగారమ్మ (80) ఇటీవల మృతి చెందారు. అలాగే పెద్దశ్రీరాంపురం గ్రామానికి చెందిన లండ పాపయ్య (55), లండ సరోజిని (60), మల్లార్పు కుమారి (45) మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను ఎంపీపీ పరామర్శించారు.

ఈ సందర్భంగా పైల దేవదాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.