బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్, భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ మధ్య డేటింగ్ జరుగుతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా మృణాల్ ఠాకూర్ పేరుతో ఓ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ రూమర్స్‌కు మరింత ఊతం లభించింది. అయితే ఆ కామెంట్ నిజంగా మృణాల్ ఠాకూర్ చేసినదేనా? లేక ఎడిట్ చేసినదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కొంతకాలం క్రితం మృణాల్ ఠాకూర్, యశస్వి జైస్వాల్ ముంబైలోని ఓ కేఫ్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. ఇద్దరూ ఒకేసారి కేఫ్ నుంచి బయటకు వచ్చినప్పటికీ వేర్వేరుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
తాజాగా మృణాల్ పేరుతో వైరల్ అవుతున్న కామెంట్ ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్ లేదా కామెంట్ ఆధారంగా మాత్రమే వీరిద్దరి మధ్య డేటింగ్ సంబంధం ఉందని నిర్ధారించడం సాధ్యం కాదు. మృణాల్ ఠాకూర్ లేదా యశస్వి జైస్వాల్ ఈ విషయంపై అధికారికంగా స్పందించే వరకు ఇవన్నీ కేవలం సోషల్ మీడియా ప్రచారం, ఊహాగానాలుగానే చూడాల్సి ఉంటుంది.