హయత్నగర్ మండలంలోని అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న JNNURM కాలనీలో నాంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్‌ను గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్ వాటర్ ఫిల్టర్‌ను ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.
కాలనీ ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో నాంది ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రజాప్రతినిధులు, గ్రామాభివృద్ధిలో ఇటువంటి సేవా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అంతటి సుష్మా అశోక్ గౌడ్‌తో పాటు గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాంది ఫౌండేషన్ ప్రతినిధులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాలనీ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి తీసుకురావడం పట్ల స్థానికులు నాంది ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.