చీపురుపల్లి: నియోజకవర్గ స్థాయి ‘డోర్ టూ డోర్ ప్రగతి’ కార్యక్రమంపై సమీక్షా సమావేశం చీపురుపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కిమిడి రామ్ మాలిక్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నియోజకవర్గంలోని పలు మండలాల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ స్థాయి కన్వీనర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
రామ్ మాలిక్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడమే లక్ష్యంగా ‘డోర్ టూ డోర్ ప్రగతి’ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు.
ఇంటింటి సర్వేలో ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు. పార్టీ శ్రేణులందరూ సమన్వయంతో పనిచేసి ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.