‘వెంకట్రామయ్య గారి తాలూకా’ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా.. జూలై 17న ప్రేక్షకుల ముందుకు సినిమా

ప్రముఖ జానపద గాయని కోమలి నిర్మాతగా మారి, కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై సోమేష్ సారిపల్లితో కలిసి నిర్మించిన భావోద్వేగ కుటుంబ కథా చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో దినేష్ కుమార్ హీరోగా నటిస్తుండగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి సతీష్ ఆవాల దర్శకత్వం వహించారు.

ఈ సినిమా జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు సినీ ప్రముఖులు హాజరై చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.

కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తూ రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమా విశేషాలను పంచుకున్న చిత్రబృందం, జూలై 17న థియేటర్లలో సినిమా చూసి ఆదరించాలని ప్రేక్షకులను కోరింది.