సింగరేణిపై వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్..

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టయ్యారు. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈరోజు అతనిని అదుపులోకి తీసుకుని, కోర్టుకు తరలించారు. ఇటీవల పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. దీంతో బాల్క సుమన్‌ను వెంటనే అరెస్టు చేయాలని, ఆయన లాంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదని కాంగ్రెస్ నాయకులు డీజీపీకి లేఖ ఇచ్చారు.

 

బాల్క సుమన్ ఏమన్నారు?

 

బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిరసనలు తెలిపేందుకు రైతులు, కార్మికులు రావడం లేదని వ్యాఖ్యానించారు. కాబట్టి బీఆర్ఎస్ నాయకులే మిలిటెంట్ తరహా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. అవసరమైతే రోడ్లపై గొడవలు చేయాలని, సింగరేణి కార్యాలయాన్ని, ఆస్తులను ధ్వంసం చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆయన వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని పలువురు మండిపడ్డారు. సీంగరేణి జీఎం కార్యాలయం, సింగరేణి భవన్ తగులబెట్టాలని బాల్క సుమన్ పిలుపునిచ్చారని, ఇది సరికాదని కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *