తేది:06-05-2026 TSLAWNEWS నిజామాబాద్జి జిల్లా ,బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ కేశపురం సుమన్.
నిజామాబాద్ జిల్లా: వేల్పూర్, భీంగల్ మండలంలోని కుప్కల్ గ్రామానికి చెందిన గాజబోయిన నవనీత బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని వేల్పూర్ కు చెందిన 2006-07 ఎస్సెస్సి పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న “మిత్రమా ఫౌండేషన్” ద్వారా బుధవారం బాధితురాలి స్వగ్రామం కుప్కల్ లోని గాజబోయిన నవనీత ఇంటికి వచ్చి భర్త గాజపోయిన సురేష్ తల్లి సమక్షంలో 82,600 రూపాయల్ని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా మిత్రమా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ గాజబోయిన నవనీత సరైన వైద్యం చేయించుకుని త్వరగా కోలుకోవాలని కాంక్షించారు.ఈ కార్యక్రమంలో మిత్రమా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.