టాటా మోటార్స్ ఈవీ సెగ్మెంట్ తన తదుపరి ఎలక్ట్రిక్ కారును త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనుంది. జనవరి 2024 చివరి వారంలో టాటా పంచ్ ఈవీని భారత్ లో విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఈ కారును రూ.11 లక్షల లోపు విడుదల చేయాలని భావిస్తోంది. ట్రీగో ఈవీలలో ఉన్న 24కే వాట్స్ యూనిట్‌తో పోలిస్తే ఇది కొంచెం పెద్ద బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. అలాగే, పంచ్ ఈవీలో ఛార్జింగ్ సాకెట్ ముందు భాగంలో అందించబడింది.