జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలుకు జీపీఎస్ ఆధారిత వ్యవస్థను 2024 మార్చి నాటికి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా మార్చి నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. దీని వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగడంతో పాటు జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.