బిగ్ బాస్ -7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యారు. గజ్వేల్ (M ) కొల్గురులో పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన వాహనాల ధ్వంసం, అల్లర్లపై పోలీసులు ఇతనిపై 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ప్రశాంత్ తో పాటు అతని తమ్ముడు మహావీర్ ను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.