నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలంలో, ఈరోజు డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ గారి 135 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.

తేది:14-04-2026, నల్గొండ జిల్లా TSLAWNEWS
నల్గొండ టౌన్ రిపోర్టర్ చిరుమర్తి భరత్ కుమార్.

నల్గొండ జిల్లా: నార్కట్ పల్లి మండలంలో డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా నార్కట్పల్లిలో మునుగోడు రోడ్డు నుండి బస్టాండ్ మీదుగా నల్లగొండ రోడ్డు చౌరస్తా మీదుగా అమ్మనబోలు చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి పలు గ్రామాల నుండి వచ్చిన అంబేద్కర్ వాదులు MRPS నాయకులు, యువకులు మరియు ఎస్సీ దళిత వర్గానికి చెందినటువంటి ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని, అంబేద్కర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా జయంతి నిర్వహించడం జరిగింది. సభను ఉద్దేశించి చిరుమర్తి యాదయ్య గారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న ఇంకా కుల వ్యవస్థ కొన్ని గ్రామాలలో అలాగే కొనసాగుతూ ఎస్సి దళితులను గుడిలోకి రానివ్వడం లేదని గుడిలోకి వచ్చిన వారి మీద దాడులు జరుగుతున్నాయని, అమానుషంగా ప్రవర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు, ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాం అంటే దానికి కారణం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే మనం చదువుకుంటున్నామని ఈ మాత్రమైన గుడిలోకి వెళ్తున్నామని ఉద్యోగాలలో రాజకీయాలలో పై స్థాయిలో ఉంటున్నామని రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించారు, మరియు సిపిఐ నకిరేకల్ ఇన్చార్జి లోడింగి కుమార్ మాట్లాడుతూ, ఇంకా అసమానతలు కొనసాగుతూ, బురుజావా వ్యవస్థ బలోపేతం అవుతుంది, పోరాటాల ద్వారానే నిర్మూలించాలని కోరారు,సిపిఎం మండల కార్యదర్శి చింతపల్లి బయన్న మాట్లాడుతూ, ప్రజలు ఆర్థిక అసమానతలతో కడు పేదలుగా మారుతున్నారని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో మేడి నరసింహ, బోడ ఎల్లయ్య, గోసుల భద్రాచలం, ఆదిమల్ల నరసింహ, చింత సైదులు, బోడ సత్యనారాయణ, లింగాల వేణుగోపాల్, బోడ శంకర్, జిల్లా మహేష్, బకరం జనార్ధన్, మందగిరి ప్రసాద్, వడ్డేపల్లి నాగరాజు, మాదాసు నరేష్,విసం మల్లయ్య, పెండ్యాల శంకరయ్య, చిరుమర్తి సైదులు, అల్లే పరమేశ, మంద సుధాకర్, వంగాల రామదాస్, ఆదిమల్ల గోవర్ధన్, చింత ప్రమీల, లింగాల యాదయ్య, బుర్రి ఎల్లేష్, గడ్డం పశుపతి, చెరుకుపల్లి రామలింగం, కొమ్ము శ్రీను, భాషపాక రవి, బొంతలి పాండు, చిరుమర్తి నరసింహ, చింత సుధాకర్, పర్వతం బుచ్చయ్య, బాకీ అర్జున్, కత్తుల దాసు, వంగాల నాగయ్య, ఆదిమల్ల నగేష్, మంద గోవర్ధన్, బందెల బిక్షం, పెరుమాళ్ళ రవి, దైద నాగరాజు, కత్తుల దాసు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *