సలార్ మూవీ టికెటు ధరలను పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. భారీ అంచనాలతో ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కానుంది. అగ్ర కథానాయకులు నటించిన సినిమాలకు, భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రాలకు మొదటి వారం టికెట్ల ధరలను పెంచుకునేందుకు వెసులుబాటు ఉంది. మైత్రీ నిర్మాణ సంస్థ టికెట్లు పెంపుకోసం చేసిన వినతిని పరిశీలించిన ప్రభుత్వం మల్టీ ప్లెక్స్ లో రూ.100 రూపాయలు, సింగిల్ థియోటర్ల లో రూ.65 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా 20 థియోటర్ల లో మాత్రమే అర్ధరాత్రి 1గంటకు బెన్ ఫిట్ షో లకు అనుమతి ఇచ్చింది. సాధారణంగా ఉండే నాలుగు షో లతో పాటు అదనంగా ఉదయం 4 గంటల నుంచి ఆరో ఆట ప్రదర్శించుకోవటానికి అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వూలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో మల్టీప్లెక్స్ లో సాధారణ థియేటర్లలో రూ.40 రూపాయలు ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. సినిమా విడుదల అయిన 10 రోజుల వరకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయని ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు షో లకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.
కేజీయఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ ,పృథ్వీ రాజ్ సుకుమారన్ మొదలైన వారు కీలక పాత్రలు పోషించారు.ఇప్పటికే చాలా నగరాలలో సినిమా టికెట్లు విక్రయాలు పెరగడంతో థియోటర్లు వద్ద అభిమానులతో సందడి నెలకొంది.