నూతన వధూవరులను ఆశీర్వదించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

తేది:12-04-2026 TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.

జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన అనుమల్ల మహేష్ – సుజాత దంపతుల కుమార్తె వివాహ వేడుకకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు. హైదర్ పల్లి లో డి.ఎల్.ఆర్ (DLR) ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో ఆయన పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట అల్లీపూర్ గ్రామ 8వ వార్డు మెంబెర్ అనుమల్ల రాజ్ కుమార్, మాజీ కో-ఆప్షన్ మెంబర్ మోఖీద్, నాయకులు మోర వెంకటేశ్వర్లు, పొట్టవత్తిని నాగభూషణం, పడాల సత్యం, డి.ఎల్.ఆర్ ఫంక్షన్ హాల్ అధినేత రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *