తేది:11-04-2026 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ దుర్గ భవాని.
హైదరాబాద్ :నాంపల్లి లోని మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియేషన్ లో స్పోర్ట్స్ & కల్చరల్ సెక్రటరీగా బొడ్డుపల్లి శ్రీనివాస్ అడ్వకేట్ బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తనపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించి ఈ గౌరవమైన బాధ్యతను అప్పగించిన ప్రతి సభ్యునికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ బాధ్యతను నిజాయితీగా, నిబద్ధతతో నిర్వహిస్తూ సభ్యులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా మరియు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
అలాగే, తనను ఆశీర్వదించి, ప్రోత్సహించిన సీనియర్ అడ్వొకేట్లు, సహచర మిత్రులు, సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సభ్యుల ప్రేమ, ఆశీస్సులు, సహకారం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.బొడ్డుపల్లి శ్రీనివాస్ అడ్వకేట్
స్పోర్ట్స్ & కల్చరల్ సెక్రటరీ ఎమ్.సి.సి.బి.ఏ, నాంపల్లి.