వెంకటేష్ విలన్ గా ధురంధర్ 2 నటుడు…

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 (AK 47 Film). ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించగా, హీరోయిన్ పాత్రలో కేజీఎఫ్ బ్యూటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 50% పైగా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నట్టు సమాచారం. ఈ ఏడాది దసరా పండుగను పురస్కరించుకొని ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

 

వెంకటేష్ విలన్ గా ధురంధర్ 2 నటుడు..

ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు మరొక యంగ్ హీరో నారా రోహిత్ కూడా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ధురంధర్ 2 నటుడు కూడా భాగం కాబోతున్నట్టు సమాచారం. ఇటీవల ఆదిత్య ధర్ డైరెక్షన్ లో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత మొదలుపెట్టింది. వందల కోట్ల కలెక్షన్లను రాబడుతూ సంచలనాలను సృష్టించడంతో ఈ సినిమాలో నటించిన నటీనటులకు కూడా అదే స్థాయిలో క్రేజ్ లభిస్తుంది.

 

ఆదర్శ కుటుంబంలో ఉదయ్ బీర్ సందు..

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు ఉదయ్ బీర్ సందు (Udaybir sandhu)యాక్టింగ్ చూసి ఫిదా అయినా త్రివిక్రమ్ శ్రీనివాస్ తనని ఆదర్శ కుటుంబం సినిమాలో భాగం చేయబోతున్నట్టు సమాచారం. ఈ విషయానికి సంబంధించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమా పట్ల మంచి బజ్ ఏర్పడిందనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో ఉదయ్ బీర్ విలన్ పాత్రలో వెంకటేష్ ను ఢీ కొట్టబోతున్నట్టు తెలుస్తోంది. మరి నిజంగానే ఆదర్శ కుటుంబంలో ధురంధర్ 2 నటుడు భాగం కాబోతున్నారా లేదా అనేది తెలియాలి అంటే అధికారక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.

 

త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకటేష్ ఫస్ట్ సినిమా…

 

ఇక వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇది మొట్టమొదటి సినిమా అని చెప్పాలి. దర్శకుడిగా త్రివిక్రమ్ వెంకటేష్ తో ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఈయన రచయితగా వ్యవహరించిన నువ్వు నాకు నచ్చావ్ మల్లీశ్వరి వంటి సినిమాలలో వెంకటేష్ నటించి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇలా త్రివిక్రమ్ కథలతో బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకటేష్ ఇప్పుడు ఏకంగా ఆయన దర్శకత్వంలో సినిమా చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. వెంకటేష్ సినిమాలన్నీ వందల కోట్ల కలెక్షన్లు రాబట్టడంతో ఆదర్శ కుటుంబంపై కూడా అదే స్థాయి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు వెంకటేష్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *