జగిత్యాలలో వైభవంగా ‘శ్రీ శివ సాయి స్వీట్స్ & హోమ్ ఫుడ్స్’ ప్రారంభం.

తేది:08-04-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.

జగిత్యాల జిల్లా కేంద్రంలో రాయిల్ల మల్లికార్జున్ నూతనంగా ఏర్పాటు చేసిన ‘శ్రీ శివ సాయి స్వీట్స్ & హోమ్ ఫుడ్స్’ను స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మల్లికార్జున్ వినూత్నంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, వ్యాపార పరంగా వారు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. స్వచ్ఛమైన, నాణ్యమైన రుచులను ప్రజలకు అందించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు గాజంగి నందయ్య, వార్డ్ సభ్యురాలు సుతారి రోజా, మాజీ కో-ఆప్షన్ మెంబర్ ముఖీద్, నరేష్, పలువురు రాజకీయ నాయకులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొని మల్లికార్జున్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *