దేశెట్టి జీవన్ కు మెమొంటో అందజేత.

తేది:06-04-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.

జగిత్యాల జిల్లా: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ డివిజన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పురస్కారాల ప్రదానోత్సవంలో ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామానికి చెందిన దేశెట్టి జీవన్ విశేష ప్రతిభ కనబరిచి అందరి ప్రశంసలు అందుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బిజినెస్ పెర్ఫార్మెన్స్‌లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ఆయనకు ఈ గౌరవం దక్కింది.స్టార్ హెల్త్ డివిజనల్ మేనేజర్ సి.వి. చారి మరియు సీనియర్ సేల్స్ మేనేజర్ అంబారి సురేష్ చేతుల మీదుగా జీవన్ మెమెంటోను అందుకున్నారు. డబ్బా గ్రామం నుండి ఇన్సూరెన్స్ రంగంలో రాణిస్తూ, కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తున్న జీవన్‌ను ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *