తేది:3-04-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.
జగిత్యాల జిల్లా: మెట్ పల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన మైత్రి హాస్పిటల్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. హాస్పిటల్‌ను డాక్టర్ జె.ఎన్ వెంకట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆధునిక సదుపాయాలు, అత్యాధునిక వైద్య పరికరాలతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని డాక్టర్ జె.ఎన్ వెంకట్ తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన డబ్బా గ్రామస్తులు దేశెట్టి జీవన్, జానా శంకర్, బైన మహేష్,బైన మల్లేష్, బైన మహేష్ కంఠం దేవన్న మరియు రాడే,శ్రీనివాస్ పాత్రికేయులు హాస్పిటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.