నల్గొండ జిల్లా నల్గొండ మండలంలోని దోమలపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి నివేదిక గ్రామసభ ఘనంగా నిర్వహించబడింది.

తేది:03-04-2026 TSLAW NEWS నల్గొండ జిల్లా ఇంచార్జ్ కానుగుల స్వామి

నల్గొండ జిల్లా: నల్గొండ మండలంలోని దోమలపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి నివేదిక గ్రామసభ ఘనంగా నిర్వహించబడింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా. ఈ సభలకు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
గ్రామాల్లో దీర్ఘకాలంగా నెలకొన్న మురుగునీటి కాలువలు, త్రాగునీరు, వీధి దీపాలు మరియు సి.సి. రోడ్ల సమస్యలపై గ్రామస్తులతో నేరుగా చర్చించారు. ఈ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
సంక్షేమ పథకాలపై అవగాహన: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలు, గ్యారెంటీ పథకాల అమలు తీరుపై ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చూడటమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని పాలకవర్గం తెలిపింది.
రాబోయే 99 రోజుల్లో పూర్తి చేయాల్సిన పనులను గుర్తించి, నిధుల వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *