తెలంగాణ ప్రభుత్వం మరియు శ్రీ గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమలవుచున్నటువంటి ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రివ్యూ చేసుకుంటూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో మూడవ స్థాయి అనగా నియోజకవర్గ స్థాయిలోభాగంగా ఈరోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15 డివిజన్ మొగిలిచర్ల గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది.

తేది:03-04-2026 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.

వరంగల్ జిల్లా: పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాలనుసారం అలాగే జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ కొండేటి కొమరా రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు తేది:02-04-2026 నాడు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామసభలో ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయని అలాగే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక అయినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నటువంటి పథకమని చేరిన గ్రామ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు అలాగే ఉచిత బస్సు పథకం, గృహ లక్ష్మీ పథకం 200 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ పంపిణీ మరియు రైతు రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వమని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారూ.
రైతు భరోసా, సన్న రకం వడ్లకి 500 రూపాయల బోనస్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతుల పక్షాన రైతుల పక్షపాతి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొనియాడారు. కళ్యాణ లక్ష్మి/ షాదీ ముబారక్ పథకం విషయంలో ఎలాంటి భాషా జాలకు పోకుండా ఏ పార్టీ వారైన ఇతర పార్టీల వారు అయినప్పటికీ గౌరవ ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు అందరికీ వర్తింపచేయాలని ఇప్పటివరకు 15 వ డివిజన్లో సుమారుగా రెండు కోట్ల యాభై లక్షల షాదీ ముబారక్/ కళ్యాణ్ లక్ష్మి ద్వారా ఈ ప్రభుత్వం పంపిణీ చేసిందని అందుకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నర సంవత్సరాల లో సుమారుగా 15 డివిజన్లో రెండు వందల పైచిలుకు కొత్త రేషన్ కార్డులు అలాగే 1100 మందిని సభ్యులుగా చేర్చడం జరిగింది.
ఇక రాబోయే పథకాలలో ప్రతి కుటుంబానికి అనగా తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 5 లక్షల ఇన్సూరెన్స్ వర్తింపజేసే విధంగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ మొన్నటి బడ్జెట్ సెషన్ లో బడ్జెట్ ఆమోదించడం జరిగింది. దానికి గ్రామసభ ఏకగ్రీవంగా ధన్యవాదాలు తీర్మానాన్ని చేయడం జరిగింది ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అలాగే మధ్యాహ్న భోజనం వసతి కూడా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇక 15 డివిజన్లో ఉన్నటువంటి కొన్ని సమస్యల అనగా ఎలక్ట్రిసిటీ విషయంలో అలాగే రోడ్ల విషయంలో అలాగే డ్రైనేజీ విషయంలోను , ముఖ్యంగా సాదా బైనమా సమస్యలను తీర్చాలని సంబంధిత రైతులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరియు మరుగుదొడ్లు అలాగే సెప్టిక్ ట్యాంకుల క్లీనింగ్ అవగాహన విషయంలో కూడా చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కొండేటి కొమరారెడ్డి పదిహేను డివిజన్ కార్పొరేటర్ ఆకులపల్లి మనోహర్, కంటెస్టెంట్ కార్పొరేటర్ ఎలగొండ ప్రవీణ్ మొగిలిచర్ల గ్రామ పార్టీ అధ్యక్షులు బెజ్జాల కుమారస్వామి గొర్రెకుంట గ్రామ పార్టీ అధ్యక్షులు ల్యాదల్ల సంపత్, మాజీ ఎంపీటీసీ పోలేపాక (సుమన్) రవీందర్ మాజీ వార్డు మెంబర్
ల్యాదల్ల నవీన్,15 వ డివిజన్ వార్డ్ ఆఫీసర్ నూర్జహాన్ గొర్రెకుంట విఆర్ఓ జ్యోతి మరియు వివిధ శాఖల అధికారులు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు కట్కూరి రవి, కందుల అశోక్,కట్కూరి సారయ్య, జిల్లా రాజు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ సిరిమిల్ల శరత్ చంద్ర , సీనియర్ నాయకులు బందెల ప్రవీణ్, రాజబోయిన రాజేందర్, ఎర్రం సూరయ్య ,ముంద భాస్కర్ పోలేపాక కిరణ్ మరియు వివిధ పార్టీల నాయకులు,రైతు సంఘ నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *