అల్లీపూర్‌లో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమం.

తేది: 02-04-2026 TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.

జగిత్యాల జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యచరణలో భాగంగా గురువారం రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామ రైతు వేదికలో ప్రత్యేక గ్రామసభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి ( ఎంపీడీవో ) చిరంజీవి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలను అందించడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి, పథకం అమలు తీరుపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎంబారి గౌతమి – వెంకటేష్, ఉప సర్పంచ్ గురులింగు వినయ్ కుమార్, గ్రామ ఇన్చార్జి సెక్రెటరీ శ్రీహరి, వార్డు సభ్యులు వివిధ శాఖల అధికారులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *