తేది:02-04-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండలం బొప్పాన్ పల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ‘ కార్యక్రమంలో భాగంగా, బోపన్పల్లి గ్రామంలో గ్రామసభను అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. 99 రోజుల ప్రణాళికా బద్ధమైన అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని, గ్రామ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ సభ సాగింది.
స్థానిక సర్పంచ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో గ్రామాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికీ చేరాలని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి న్యాయం జరగాలని సర్పంచ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ అనిల్ పాటిల్ స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ ప్రజా ప్రతినిధులు మరియు గ్రామ ప్రముఖులు చురుగ్గా పాల్గొన్నారు.
ఉప సర్పంచ్: రాములు
వార్డు సభ్యులు: ప్రవీణ్, సురేఖ, దస్తమ్మ, శిరోమణి, మరియు విష్ణు. వీరితో పాటు గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు మరియు యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గ్రామస్తులందరూ తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
గ్రామస్తుల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని సభలో పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా -99 ప్రణాళికలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన, డ్రైనేజీ వ్యవస్థ, మరియు సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. యువత మరియు గ్రామ పెద్దల క్రియాశీలక ప్రమేయంతో ఈ గ్రామసభ అత్యంత విజయవంతంగా ముగిసింది.