ఇశ్రతాబాద్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి కార్యక్రమం విజయవంతం చేసిన- ఇస్మితాబాద్ గ్రామ ప్రజలు.

తేది:02-04-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS ఇశ్రతాబాద్ గ్రామ రిపోర్టర్ మర్పల్లి రాజ్ కుమార్.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలంలోని ఇశ్రతాబాద్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ విజయవంతంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉపాధి హామీ A.P.O గీతా దేవి గారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులు పారదర్శకంగా జరుగుతున్నాయని ఎలాంటి అవినీతికి తావు లేకుండా వేతనాలు అందిస్తున్నామని తెలిపారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే పంచాయతీ కార్యాలయంలో సెక్రటరీ కి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ఉప సర్పంచ్ కట్టేగోసే శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని రేవంత్ రెడ్డి నాయకత్వంలో అబివృద్ధి లో ముందుకు దూసుకుపోతోందని తెలిపారు.
వార్డు సభ్యులు రషీద్ గారు మాట్లాడుతూ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని, రెండు లక్షల రుణాలను కూడా మాఫీ చేయడం జరిగిందని, ఇందిరమ్మ ఇళ్ళ పథకంతో పేదవాడి కల అయిన ఇల్లు నిర్మాణం నెరవేరిందని తెలిపారు
కార్యక్రమానికి హాజరైన A.N.M పూల సిస్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం టీనేజీ బాలికల కోసం చేపట్టిన HPV టీకాల కార్యక్రమం కోసం వివరించారు. ఈ టీకాలు వేయించడానికి టీనేజీ బాలికల తల్లిదండ్రులు సంశయించవద్దని ఈ టీకాలు వేయించడం వలన భవిష్యత్ లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదని సూచించారు.అదేవిధంగా గర్భిణులు, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారం తీసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు అమృత మాట్లాడుతూ గ్రామంలో 13 డ్వాక్రా మహిళా సంఘాలు ఉన్నాయని చెప్పారు. మహిళా సంఘ సభ్యులకు ప్రభుత్వం రుణ పరిమితి పెంచి రెండు లక్షలు మంజూరు చేస్తున్నదని, ఈ చొరవతో మహిళలు వాళ్ళ కాళ్లపై నిలదొక్కుకునేందుకు అవకాశం లభించిందని తెలిపారు.
కార్యక్రమంలో లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఎంతో మేలు చేకూర్చాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *