తేది:31-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.
జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలోని మల్లన్న గుడి ఆవరణలోడబ్బా సత్తన్న జంట నగరాల ఎల్లాపుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డబ్బా గ్రామ మాజీ సర్పంచ్ లింగంపల్లి గంగాధర్, హనుమాన్ స్వాములు కలిసి సత్తన్నను అభినందిస్తూ శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడిన సత్తన్న యువత విద్యపై దృష్టి సారించాలని, సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధికి యువకులు ముందుండాలని, ఐక్యతతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. కార్యక్రమంలో స్వాములు తదితరులు పాల్గొన్నారు.