తేది: 31-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.
జగిత్యాల జిల్లా :ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన శ్రీపాద లింబాద్రికి జాతీయ ఉగాది పురస్కారం వరించింది. మార్చి 30న కరీంనగర్ నగరంలోని ఫిలిం భవన్ వేదికగా తెలుగు వెలుగు జాతీయ ఉగాది సాంస్కృతిక ఉత్సవాలు–2026 ఘనంగా నిర్వహించారు. తెలుగు వెలుగు సాహితీ వేదిక, తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, కాళోజి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు ఈ సందర్భంగా పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన శ్రీపాద లింబాద్రికి ఉగాది జాతీయ నంది అవార్డు అందజేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత విశ్వకళా విరాట్ డాక్టర్ శాంతి వంగల కృష్ణ ఆచార్యులు, ప్రముఖ హాస్యనటుడు నంద, సహజనటి గుంటుక రాధిక, జాతీయ యువజన అవార్డు గ్రహీత కిరణ్ కుమార్, తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ చైర్మన్ పోలోజు రాజ్ కుమార్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు.