తేది:30-03-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: మారకద్రవ్యాల కేసులో ఐదుగురు నిందితులకు 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు, ఒక్కొక్కరికి రూ. 10 వేల జరిమానా విధించినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. 2022లో మల్యాల మండలం నూకపల్లి అర్బన్ కాలనీలో గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా, నిందితులపై నేరం రుజువు కావడంతో సోమవారం జగిత్యాల అదనపు జిల్లా సెషన్స్ కోర్ట్ జడ్జి సుగాలి నారాయణ నిందితులకు శిక్షను ఖరారు చేశారు. కాగా, ఈ కేసులో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ హరీష్, రాజునాయక్ తో పాటు, ఏపీపీ బిట్ల నర్సయ్యకు ఎస్పీ అశోక్ కుమార్ అభినందనలు తెలియజేశారు. ఈ తీర్పు మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారానికి వ్యతిరేకంగా పోలీస్ శాఖ సాధించిన విజయంగా అభివర్ణించారు. యువతను గంజాయి వ్యసనం నుంచి రక్షించే దిశలో ఇది బలమైన హెచ్చరికగాపరిగణించబడుతోందన్నారు.