తేది:28-03- 2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండల కేంద్రం లో నూతనంగా నిర్మించనున్న సి.సి. రోడ్డు పనులను సర్పంచ్ వినోద బాలరాజ్ అధికారికంగా ప్రారంభించారు.
గ్రామంలోని మసీదు ముందు నుంచి ఎస్సీ కాలనీ వరకు వెళ్లే దారిలో సి.సి. రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు.
గ్రామంలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం మమతా అనిల్ పటేల్, బొగ్గుల గాలప్ప, పటేల్ శ్రీను, పటేల్ ప్రకాష్ సింగ్, సంజు సింగ్, ఉల్లాస్, కొమారి గోపాల్, షేక్ రబ్బానీ, ఫయాజ్, అమీర్, గఫార్, ఏసప్ప, ప్రవీణ్ కుమార్, జంగిలి విశ్వనాథం, తేజమ్మ తదితరులు పాల్గొన్నారు.