మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు – ఎస్సై 2 నారాయణ హెచ్చరిక.

తేది:28-03-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.

సంగారెడ్డి జిల్లా: ​ఝరాసంగం మండల కేంద్రం లో రహదారి భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, ఝరాసంగం మండల పరిధిలోని స్థానిక ఎస్సై 2 ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు తీసుకున్నారు.
​ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేనిపక్షంలో జరిమానాలు తప్పవని స్పష్టం చేశారు.
​డ్రంక్ అండ్ డ్రైవ్: మద్యం సేవించి వాహనం నడిపే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి, బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు.
​ఈ సందర్భంగా ఎస్సై 2 వాహనదారులకు మరియు తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. మైనర్లకు (చిన్నపిల్లలకు) వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, అలా జరిగితే వాహన యజమానులైన తల్లిదండ్రులపైనే కఠినమైన కేసులు నమోదు చేస్తామని అవగాహన కల్పించారు.
​ఈ కార్యక్రమంలో ఎస్సై తో పాటు పోలీస్ సిబ్బంది నారాయణ, సందీప్, మారుతీ, శ్రీశైలం, మరియు ఎండి. యూనస్ పాల్గొన్నారు.
​”ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలి. ముఖ్యంగా యువత వేగంగా వాహనాలు నడపవద్దు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *