సైలెంట్ గా “డ్రాగన్”..? ‘డ్రాగన్’పై సరికొత్త డౌట్స్..

KGF సిరీస్ ,సలార్ సినిమాలతో నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ తారక్ తో సినిమా అనగానే ఎగిరి గంతేశారు నందమూరి ఫ్యాన్స్. ఇక మా హీరోకి మరో వెయ్యికోట్ల సినిమా పక్కా అని కాలర్ ఎగరేశారు కూడా. అలా అంచనాలు స్కై లెవల్ లో పెట్టేసిన ఈ సినిమా గురించి ఇపుడు చక్కర్లు కొడుతున్న అప్ డేట్స్ వింటే పూనకాలు రావడం అటుంచి గుండె ఆగినంత పనవుతుందట. అవును ..సినిమా ముహూర్తం పెట్టుకుని ఇన్నేళ్లయినా ఇప్పటికీ కేవలం 40 శాతం షూటింగ్ మాత్రమే కంప్లీట్ అయిందన్న వార్త ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేస్తున్నాయ్.దీంతో ఈ డ్రాగన్ గర్జించేదెప్పుడో మా హీరో రికార్డులు రీరైట్ చేసేదెప్పుడో అని డీలా పడిపోతున్నారట డై హార్డ్ ఫ్యాన్స్ .

 

ఇప్పటికీ సగం కూడా కంప్లీట్

 

ముఖ్యంగా సినిమాని ఓ రేంజ్ లో తీస్తున్నాని,ప్రతి సీన్‌ను హై స్టాండర్డ్స్‌లో ఆదరగొడుతున్నాని చెప్పి షూటింగ్ ని చాలా స్లోగా తీస్తున్నాడన్నా వార్తలు వినిపిస్తున్నాయ్ .మొదలెట్టి దాదాపు రెండేళ్ళు గడిచిపోయినా ఇప్పటికీ సగం కూడా కంప్లీట్ కాలేదంటే అసలు నీల్ మామ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేద్దామనుకుంటూన్నాడు అంటూ చెడుగుడు ఆడేస్తున్నారు నెటిజన్లు .

 

నిజానికి RRR తర్వాత తారక్ రేంజ్ మారిపోయింది.కానీ ఒకవైపు డ్రాగన్’ అప్డేట్స్ లేకపోవడం,మరో వైపు షూటింగ్ స్లోగా సాగడంతో కొంపదీసి సినిమాని రెండు పార్ట్స్ గా తీస్తున్నారా ఏంటి అన్న డౌట్స్ కూడా రైజ్ చేస్తున్నారు.మరో వైపు

రుక్మిణి వసంత్ లాంటి కొత్త హీరోయిన్‌ను తీసుకుని కూడా ఆమె సీన్లు తీయడానికి ఇంతింత టైం స్పెండ్ చేస్తే ఇక భారీ యాక్షన్ సీక్వెన్సుల పరిస్థితి ఏంటి? చూస్తుంటే వర్క్ తక్కువ – హైప్ ఎక్కువ అన్నట్టుగా ఉందని ఫైర్ అవుతున్నారు తారక్ ఫ్యాన్స్.

 

సినిమాపై వందల కోట్లు

 

ఇక ఇప్పటికే సినిమాపై మైత్రి మూవీ మేకర్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి వందల కోట్లు కుమ్మరిస్తున్నాయి. షూటింగ్ ఇలాగే ఆలస్యమైతే వడ్డీలు పెరిగిపోవడం, ప్రొడక్షన్ ఖర్చులు భారమవ్వడం ఖాయం.ఏది ఏమైనా ప్రశాంత్ తన స్టైలిష్ మేకింగ్ కోసం ఇలా మేకర్లను మరియు హీరోను ఇబ్బంది పెడుతున్నారా? అనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో కాస్త గట్టిగానే వినిపిస్తుంది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇప్పటివరకు చూడని అవతార్‌లో కనిపిస్తారని చెప్తున్నా.. అసలు ఆ అవతార్ ఎప్పుడు బయటకు వస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి.

 

ఏది ఏమైనా తారక్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే. సో ఇప్పటికైనా మేకర్స్ చేస్తున్నఇలా స్లో షూటింగులు చేయకుండా సినిమాని వేగంగా పరుగులు పెట్టిస్తే మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *