తేది:25-03-2026 TSLAWNWES వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
వరంగల్ జిల్లా: తెలంగాణ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో అఖిలేష్ కుటుంబానికి అండoగా వరంగల్ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న శ్రీ జె. అఖిలేష్ మృతి పట్ల తక్షణమే, న్యాయబద్ధమైన విచారణ జరపవలసిందిగా కోరుతు.అఖిలేష్‌కు న్యాయం జరగాలని, మృతికి కారణమైన మేనేజర్‌ను చట్టపరంగా శిక్షించాలని పిన్నవారి వీధి నుండి పోచమ్మమైధాన్ వరకు క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కార్యదర్శులు సుధీర్ కుమార్,మహేష్ , ట్రెజరర్ బాస్కర్, రాష్ట్ర నాయకులు సతీష్,నరేష్,రాజ్‌కుమార్, సహా 60 మంది సభ్యులు పాల్గొన్నారు.