మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఆయన నటిస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా నుంచి ఓ పవర్ ఫుల్ అప్డేట్ను మేకర్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మెగా ఫ్యాన్స్‌కు ఈ బర్త్‌డే డబుల్ ట్రీట్‌ని ఇవ్వబోతుంది. ఒకవైపు చరణ్ బర్త్‌డే, మరో వైపు ‘పెద్ది’ గ్లింప్స్‌తో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని తాకబోతున్నాయి. తాజాగా ‘పెద్ది’ గ్లింప్స్‌కు సంబంధించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఇక మీ ఫీడ్ అంతా ‘పెద్దిఫైడ్’ కాబోతుందని తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. అసలైన గేమ్ మొదలు కాబోతుందనే దానికి సూచికగా, గేమ్ అనే లెటర్స్‌తో ఓ క్రీడా ప్రాంగణాన్ని ఇందులో చూపిస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. అంతేకాదు, సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడుతుందనే వార్తలకు కూడా బ్రేక్ వేస్తున్నట్లుగా మరోసారి ఈ మూవీ విడుదల తేదీని ఈ పోస్టర్లో ప్రకటించారు.
మార్చి 27న ట్రీట్ రెడీ.. (Peddi Update)
మొదటి నుంచి చెబుతున్నట్లుగా ఏప్రిల్ 30న ఈ సినిమా రిలీజ్ ఉంటుందనే విధంగా ఈ పోస్టర్లో రిలీజ్ డేట్‌ని తెలిపారు. ఇక పోస్టర్లో చూపించిన క్రీడా ప్రాంగణం.. కుస్తీ పోటీలకు సంబంధించినదిగా తెలుస్తోంది. ఇప్పటి వరకు క్రికెట్ బ్యాట్‌తో కనిపించి ‘రై రై రారా’ అని పిలిచిన రామ్ చరణ్, ఈసారి కుస్తీలో తన సత్తా చాటబోతున్నాడనేది ఈ పోస్టర్ తెలియజేస్తోంది. కుస్తీ సీన్లతో గ్లింప్స్‌ని అదిరిపోయేలా కట్ చేశారని ఇప్పటికే చూసిన వారంతా చెప్పుకుంటుకున్నారు. ఈ గ్లింప్స్‌ని రామ్ చరణ్ పుట్టినరోజైన మార్చి 27న ఉదయం 11 గంటల 07 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా ఈ పోస్టర్లో ప్రకటించారు. ‘పెద్ది’ గ్లింప్స్ విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన రావడంతో, ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ.. ఈ పోస్టర్ని వైరల్ చేస్తున్నారు.
చిన్న సర్జరీ జరిగింది..
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన కంటెంట్, భారీగా అంచనాలను పెంచేసింది. ఫ్యాన్స్ అంతా అప్డేట్ కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. మరో వైపు రామ్ చరణ్ (Ram Charan)కు ఈ మూవీ సెట్స్‌లో గాయమైనట్లుగా వచ్చిన వార్తలతో ఫ్యాన్స్ అంతా ఆందోళనలో ఉన్నారు. అలా ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్‌కు, చిత్ర టీమ్ వివరణ ఇచ్చింది. ‘రామ్ చరణ్‌కు ఏం కాలేదు. షూటింగ్లో ఎడమవైపు కంటిపై చిన్న గాయం అయింది. దానికి మైనర్ సర్జరీ జరిగింది, రేపటి నుంచి రామ్ చరణ్ మళ్లీ షూట్లో పాల్గొంటారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. షూటింగ్ షెడ్యూల్‌కు ఎలాంటి అంతరాయం లేదు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అన్నీ కంట్రోల్ వున్నాయి ఉన్నాయి. సినిమా పనులు సజావుగా కొనసాగుతున్నాయి’ అని మేకర్స్ అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.. లేదంటే మార్నింగ్ నుంచి, రామ్ చరణ్‌కు ఏమైంది? అనేలా తెగ వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటు హెల్త్ అప్డేట్, అటు గ్లింప్స్ అప్డేట్తో ముందే ఫ్యాన్స్‌లో సంతోషాన్ని నింపేశారు మేకర్స్. ఇక గ్లింప్స్ కోసం వెయిటింగ్ అనేలా.. అంతా ఎదురు చూస్తున్నారు.