మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిసిన దేశేట్టి జీవన్.

తేది:25-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.

జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేశేట్టి జీవన్, జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డిని తేది :24-03-2026 నాడు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా పార్టీ పట్ల తమ అంకితభావాన్ని వ్యక్తం చేస్తూ, ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీని వీడకూడదని విజ్ఞప్తి చేశారు.ఈ భేటీలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలంలోని పలు సమస్యలను మాజీ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వాటిపై ఆయన వివరాలు తెలుసుకుంటూ స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు . ప్రాంతీయ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించినట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *