కోలీవుడ్‌లోనూ దూరంధర్ మేనియా..! ‘ధురంధర్ 2’పై రజినీకాంత్ పోస్ట్ వైరల్.!

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ (Dhurandhar2) మేనియా ఏ విధంగా నడుస్తోందో తెలియంది కాదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సినీ ప్రముఖులందరూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన టాప్ స్టార్స్ అందరూ ఈ చిత్రాన్ని చూసి అదిరిపోయే రివ్యూలు ఇచ్చారు. సినిమాలోని కంటెంట్, మేకింగ్ వాల్యూస్ చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఇండియన్ సినిమా లెజెండ్, సూపర్ స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth) వచ్చి చేరారు. ‘‘వాట్ ఏ ఫిలిం.. ధురంధర్ 2!! ఆదిత్య ధర్ (Aditya Dhar) బాక్సాఫీస్ కా బాప్. రణవీర్ సింగ్ (Ranveer Singh) మరియు చిత్ర యూనిట్ మొత్తానికి నా అభినందనలు. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది. జై హింద్’’ అంటూ రజినీకాంత్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రజినీ వంటి దిగ్గజ నటుడు సినిమాను ఇంతగా మెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ ఆనందానికి అవధులు లేవు.

 

రజినీ ట్వీట్‌తో కోలీవుడ్‌లోనూ ఊపొచ్చినట్టే..

ఇప్పటి వరకు మన టాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులు ఈ సినిమాను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. సినిమా కథాంశం, యాక్షన్ సన్నివేశాలు మన వాళ్లని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే, ఇప్పుడు ఈ జోరు కోలీవుడ్ వైపు మళ్లింది. రజినీకాంత్ స్వయంగా రంగంలోకి దిగి ప్రశంసలు మొదలుపెట్టడంతో తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ‘ధురంధర్ 2’పై భారీగా చర్చ జరుగుతోంది. రజినీకాంత్ ఒక సినిమా గురించి ఇలా బహిరంగంగా స్పందించడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది రణవీర్ సింగ్ నటనను, ఆదిత్య ధర్ దర్శకత్వ ప్రతిభను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారంటే ఈ సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీంతో కోలీవుడ్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

 

నెక్ట్స్ స్పందించేది ఎవరో?

టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోలందరూ స్పందించారు.. ఇప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన రివ్యూ ఇచ్చేశారు. ఆయన స్పందన చూస్తుంటే, కోలీవుడ్ వర్గాల్లో ‘ధురంధర్ 2’పై ఒక రకమైన ఊపొచ్చిందని చెప్పవచ్చు. మరి రజినీకాంత్ తర్వాత ఈ చిత్రంపై స్పందించే ఆ కోలీవుడ్ స్టార్ ఎవరో అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అక్కడ విజయ్, అజిత్, కమల్ హాసన్ వంటి స్టార్ల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరు ముందుగా సినిమా చూసి తమ స్పందనను తెలియజేస్తారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. రజినీకాంత్ చెప్పినట్టుగా ‘బాక్సాఫీస్ కా బాప్’ అనిపించుకుంటున్న ఈ సినిమా, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాయడం పక్కాగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *