తేది:22-03-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ వారి ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగిత్యాల నియోజకవర్గం రైతులకు కూరగాయల చిరు సంచులను పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ .అనంతరం సిద్దిపేట జిల్లా నర్మెట్ట లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఆయిల్ ఫామ్ కర్మాగారానికి వెళుతున్న రైతుల బస్ ను జెండా ఊపి ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఆత్మ ఛైర్మెన్ కాటిపెల్లి గంగారెడ్డి,ఉద్యానవన అధికారి స్వాతి,రైతు నాయకులు,సర్పంచులు,ప్రజా ప్రతినిధులు,రైతులు, తదితరులు పాల్గొన్నారు.