తేది:21-03-2026 TSLAWNEWS తెలంగాణ ఇంచార్జ్ గౌండ్ల రమేష్ గౌడ్.
తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ 2026 ఎన్నికల్లో మూడోసారి ఘనవిజయం సాధించిన వైస్ చైర్మన్ కుంచ సునీల్ గౌడ్ గారికి అభినందనలు తెలియజేసిన హైకోర్టు సీనియర్ న్యాయవాదులు మరియు తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మొదటిసారి 2011లో బార్ కౌన్సిల్ మెంబర్గా గెలిచిన సునీల్ గౌడ్ గారు న్యాయ వ్యవస్థలో ఎన్నో సేవలు అందించారు దానికి నిదర్శనంగా 2018లో మళ్లీ ఎన్నిక కాగా సునీల్ గౌడ్ గారిని బార్ కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి వైస్ చైర్మన్గా నియమించారు అంతేకాకుండా గత సంవత్సరం ఆయనను హైకోర్టు క్రికెట్ అసోసియేషన్ కెప్టెన్ గా ఎన్నుకున్నారు ఇప్పుడు మళ్లీ 2026 బార్ కౌన్సిల్ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన సునీల్ గౌడ్ గారి పట్ల యావత్ తెలంగాణ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు అలాగే నిత్యం న్యాయవాదుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్న సునీల్ గౌడ్ గారిని బార్ కౌన్సిల్ చైర్మన్గా ఎన్నుకోవాలని తెలంగాణ న్యాయవాద సంఘాలు మద్దతు తెలిపారు
ఈ సందర్భంగా సునీల్ గౌడ్ గారు మాట్లాడుతూ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిపించిన యావత్ తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే నూతనంగా ఎన్నికైన బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు