రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నాగరాజు.

తేది:21-03-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.

వరంగల్ జిల్లా: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ రియాజ్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, హన్మకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్ నివాసాలకు వెళ్లి వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు.ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి తో కలిసి వారి కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ రంజాన్ పండుగ సోదరభావం, సహనం, దానం వంటి విలువలను ప్రతిబింబించే పవిత్రమైన పండుగ అని అన్నారు. సమాజంలో ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి పండుగలు ఎంతో తోడ్పడతాయని పేర్కొన్నారు.ముస్లిం సోదర సోదరీమణులందరికీ శాంతి, సౌభ్రాతృత్వం కలగాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *