మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ది సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. అయితే చివరి క్షణంలో ఈ సినిమా వాయిదా పడుతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు రాగా ఈ వార్తలను చిత్ర నిర్మాతలు ఖండించారు. ఇక ఈ సినిమాలో మరో రెండు పాటలకు సంబంధించిన షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని, మరొక వారం రోజులలో ఈ షూటింగ్ పూర్తి అవుతుందని తెలుస్తోంది. ఇలా సినిమా షూటింగ్ పనులను శరవేగంగా పూర్తి చేస్తూ అనుకున్న విధంగానే ఏప్రిల్ 30వ తేదీ ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపారు.
చరణ్ బర్త్ డే స్పెషల్ కుస్తీ టీజర్ విడుదల..
ఇకపోతే ఈ సినిమా నుంచి త్వరలోనే మరొక బిగ్ అప్డేట్ రాబోతోందని సమాచారం. మార్చి 27వ తేదీ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక చరణ్ పుట్టినరోజు సందర్భంగా కుస్తీ పోటీలకు సంబంధించిన ఒక టీజర్ విడుదల చేయబోతున్నారని సమాచారం. గతంలో క్రికెట్ కి సంబంధించిన టీజర్ విడుదల చేయగా అద్భుతమైన ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలోనే చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి కుస్తీ టీజర్ విడుదల చేయబోతున్నట్టు సమాచారం.
గ్రామీణ క్రీడా నేపథ్యంలో పెద్ది..
ఈ టీజర్ విడుదలకు సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి అయ్యాయని టీజర్ అద్భుతంగా ఉండబోతుందని ఇండస్ట్రీ సమాచారం. ఈ సినిమా గ్రామీణ క్రీడా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన రెండు పాటలు అద్భుతమైన ఆదరణను సొంతం చేసుకున్నాయి. ఇక చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోయే కుస్తీ టీజర్ ఎలా ఉండబోతుందోననే ఆత్రుత అభిమానులలో ఉంది. ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి చరణ్ పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బాస్టర్ అందుకోబోతున్నారని స్పష్టం అవుతుంది.
పెద్ది పైనే మెగా అభిమానుల ఆశలు..
రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన నటించిన ఆచార్య, గేమ్ చేంజర్ వంటి సినిమాలు పూర్తిగా ప్రేక్షకులను నిరాశ పరుస్తూ డిజాస్టర్ గా మిగిలిన సంగతి తెలిసిందే. ఇలా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న చరణ్ పెద్ది సినిమాతో అభిమానులకు కావలసిన వినోదాన్ని అందించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా విషయంలో చరణ్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఏప్రిల్ 30వ తేదీ ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా వృద్ధి బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు రాబోతోంది బుచ్చిబాబు దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో రామ్ చరణ్ జాన్వి కపూర్ జంటగా నటిస్తున్నారు.