ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు దరఖాస్తు నిబంధనలు మారనున్నాయి. పాన్ కార్డు దరఖాస్తు విధానంలో మార్పులు తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు పాన్ కార్డు దరఖాస్తుకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకునేవారు. కానీ ఇకపై ఆధార్ కార్డుతో పాన్ కార్డు దరఖాస్తుకు అవకాశం లేదు. మార్చి 31తో ఈ గడువు ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి..కొత్త పాన్ దరఖాస్తు నిబంధనలు.. దరఖాస్తు పత్రాలు, ఫారాలు, మొత్తం దరఖాస్తు ప్రక్రియను ప్రభావితం చేయనున్నాయి.
మార్చి 31 వరకే ఛాన్స్
మార్చి 31, 2026 వరకు ఆధార్ కార్డును ఉపయోగించి పాన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం పాన్ దరఖాస్తును పూర్తి చేయడానికి అత్యంత సులభమైన వేగవంతమైన మార్గం ఇది. కానీ ఈ గడువు ముగిసిన తర్వాత, కొత్త పాన్ దరఖాస్తులకు కేవలం ఆధార్ మాత్రమే సరిపోదని ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు తెలిపారు. దరఖాస్తుదారులు ఆధార్ వివరాలతో పాటు అదనపు గుర్తింపు కార్డులు సమర్పించాల్సి ఉంటుంది.
కొత్త పాన్ అప్లికేషన్
ఏప్రిల్ 1, 2026 తర్వాత పాత పాన్ దరఖాస్తు ఫామ్ లను అంగీకరించరు. కొత్త ఫామ్ లను తీసుకురానున్నారు. వీటిని ఆన్ లైన్ అందుబాటులో ఉంచనున్నారు.
పాన్ కార్డుపై ఉన్న పేరుకు మార్చుకోవడానికి మరో ముఖ్యమైన అప్డేట్ తీసుకురానున్నారు. ఏప్రిల్ నుంచి పాన్ కార్డుపై పేరు ఆధార్ లోని వివరాలతో కచ్చితంగా సరిపోయేలా ఉండాలి.
DOB ప్రూఫ్‌గా ఉపయోగించే పత్రాలు
పుట్టిన తేదీ (DoB) వెరిఫికేషన్ కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. పుట్టిన వివరాలను నిర్ధారించడానికి ఆధార్‌తో పాటు అదనపు పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవసరమైతే అఫిడవిట్లు, ఇతర ప్రభుత్వ పత్రాలను కూడా ఉపయోగించవచ్చు. 01 అక్టోబర్ 2023 తర్వాత పుట్టిన వారికి తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ మాత్రమే ఫ్రూఫ్ గా పెట్టాలి.