ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మురికి కాలువల శుద్ధీకరణకు శ్రీకారం పరిశుభ్రతకు ప్రాధాన్యం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.

తేది:19-03-2026హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.

వరంగల్ జిల్లా: వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపడుతున్న పరిశుభ్రత కార్యక్రమాలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.వర్ధన్నపేట పట్టణాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు అహర్నిశలు కష్టపడుతున్న పారిశుద్ధ కార్మికులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. వారి సేవలను గుర్తించి ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని తెలిపారు.గతంలో మున్సిపాలిటీలో ఉద్యోగాల విషయంలో కొంతమంది వద్ద డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చి తర్వాత తొలగించారనే విషయం తన దృష్టికి వచ్చిందని, ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అలాగే వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో జనాభా ప్రాతిపదికన అవసరమైన పారిశుద్ధ కార్మికులను నియమించే అంశంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
ఓరుగల్లు నగర అభివృద్ధిపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఆ పనులకు సంబంధించి 250 మంది కార్మికుల పోస్టులను మంజూరు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశామని తెలిపారు.పరిశుభ్రత అత్యంత ముఖ్యమని, పారిశుద్ధ కార్మికులతో సమావేశం నిర్వహించి వర్ధన్నపేటను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే స్వయంగా రైతులతో సమావేశమై సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు ఓపెన్ జిమ్‌లు, వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.అదేవిధంగా త్వరలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు, ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించబడతాయని, నిరంతరం ప్రజల కోసం కష్టపడుతూ వర్ధన్నపేటను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే నాగరాజు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ నేతవత్ శీభారాణి- రాజేందర్, కౌన్సిలర్స్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య, ఐనవోలు ఆలయ ఛైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు
పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *