తేది:19-03-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.
వరంగల్ జిల్లా : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా హన్మకొండ కేయూ క్రాస్ రోడ్డు నుండి వివేక్ నగర్ వరకు రోడ్లు & భవనాల శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.45 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన ఆధునిక సెంటర్ లైటింగ్‌ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి , హన్మకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ వాజ్పేయి తో కలిసి ప్రారంభించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులకు వేగం పెరిగిందని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.హన్మకొండ నగరంలో రహదారుల అభివృద్ధి, స్ట్రీట్ లైటింగ్, డ్రైనేజీ వంటి ప్రాధాన్య అంశాలపై దశలవారీగా పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో భద్రత కల్పించేందుకు సెంటర్ లైటింగ్ ఎంతో కీలకమని, ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రజలకు భారీగా ఉపయోగం చేకూరుతుందని అన్నారు.ఇప్పటి వరకు వెలుతురు సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలకు ఈ లైటింగ్ ఏర్పాటు వల్ల సురక్షితమైన ప్రయాణం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రమాదాల నివారణతో పాటు నగర సౌందర్యం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం “ప్రజా పాలన–ప్రగతి పథం” లక్ష్యంతో ప్రతి ప్రాంతాన్ని సమానంగా అభివృద్ధి చేయాలని కృషి చేస్తోందని, ఎక్కడా అభివృద్ధిలో వెనుకబాటు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.భవిష్యత్తులో కూడా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి హన్మకొండను ఆధునిక నగరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని, ప్రజల సహకారంతో ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.స్థానిక ప్రజలు సెంటర్ లైటింగ్ ప్రారంభంపై హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.