తేది:17-03-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర భాషా మరియు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో యం.వి.ఆర్ ఫౌండేషన్ సహకారంతో ప్రముఖ సాహిత్య గ్రంథం “డమరుకం” ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సాహితీవేత్తలు, ప్రముఖులు, ఆహ్వానితులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రంథం: “డమరుకం”
రచయిత: శ్రీ జనువాడ రామస్వామి ఈ గ్రంథాన్ని బండారు దత్తాత్రేయ పూర్వ గవర్నర్ (హర్యానా)వేదికపై ఘనంగా ఆవిష్కరించారు.
అలాగే గ్రంథం స్వీకర్తగా బి. లక్ష్మీకాంతం (ఐ.ఏ.ఎస్ రిటైర్డ్),పూర్వ కృష్ణా జిల్లా కలెక్టర్ గ్రంథాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో పలువురు సాహితీ ప్రముఖులు, అధికారులు, సాంస్కృతిక రంగానికి చెందిన వ్యక్తులు పాల్గొని గ్రంథంలోని ఆధ్యాత్మికత, సాహిత్య విలువలను ప్రశంసించారు. “డమరుకం” గ్రంథం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. “డమరుకం వంటి ఆధ్యాత్మిక గ్రంథాలు మన సంస్కృతి, విలువలను తరతరాలకు అందించే ముఖ్యమైన సాధనం. ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి స్పూర్తినిస్తాయి” అని తెలిపారు.