GWMC శానిటేషన్ పనుల కోసం 250 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకానికి కోసం సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన మంత్రి సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు, మేయర్ సుధారాణి.

తేది:17-03-2026 వరంగల్ జిల్లా TSLAWNEWS వర్ధన్నపేట ఇంచార్జ్ బొంతల రాకేష్.

వరంగల్ జిల్లా: హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణంలో నేడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్ మరియు ఇతర పనుల నిర్వహణకు 250 మంది సిబ్బందిని ఔట్సోర్సింగ్ విధానంలో నియమించేందుకు మంజూరు ఇవ్వాలని గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డిని కలిసి, సంబంధిత ఫైల్ ప్రస్తుతం మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల వద్ద ఉన్నందున, దానిని ఈ మార్చ్ నెలాఖరు నాటికి ఆమోదించాలని అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, ఈ నెలాఖరు నాటికి మంజూరు కల్పించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *