ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన దావత్-ఏ-ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు.

తేది:15-03-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.

వరంగల్ జిల్లా: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మరియు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.తొలుత ఇఫ్తార్ విందుకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఎమ్మెల్యే నాగరాజు కరచాలనం చేస్తూ ఆత్మీయంగా స్వాగతం పలికారు.మత సామరస్యాన్ని ప్రతిబింబించే ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ విందులో ముస్లిం పెద్దలు నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *