తేది:15-03-2026 TSLAWNEWS నల్గొండ టౌన్ రిపోర్టర్
చిరుమర్తి భరత్ కుమార్.
నల్గొండ జిల్లా: నల్లగొండ పట్టణంలో బ్రహ్మంగారి గుట్ట స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ అష్టమిలు తేదీ:26-03-2026 గురువారం నుండి తేదీ:27-03-2026శుక్రవారం వరకు ,శ్రీసీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుపబడును ,కార్యక్రమం వివరాలు: తేదీ:26-03-2026 గురువారం ఉదయం 7:30 గంటల ని”లకు శ్రీ విఘ్నేశ్వరపూజ, పుణ్యహవచనం, అఖండ దీపస్థాపన, మంటపారాధనం, కలశస్థాపన, పూజాదికాలు, మంత్రనుష్టాన పారాయణాలు, మూల విరాట్లకు అభిషేకం తదనానంతరం తీర్థప్రసాద వినియోగం, సా”గం.6-00 లకు ప్రదోష పూజలు, వేదస్వస్తి మరియు భజన కార్యక్రమాలు నిర్వహించబడును. తేదీ:27-03-2026 శుక్రవారం ఉ,,గం.8-00 లకు మంటప పూజ, అనుష్టాకాలు,ఉ,,గం11-59 ని,,లకు శ్రీ ఖర్జూర సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం తదుపరి తీర్థ ప్రసాద వినియోగం. యాజ్ఞికులు: బ్రహ్మశ్రీ రామడుగు విద్యాసాగర్ శర్మ గారు,అర్చకులు: శివజీ గారు,భక్తులెల్లరు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవ కార్యక్రమాలను తిలకించి స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించి భగవత్ కృపకు పాత్రులు కాగలరని మనవి. ఆలయ కమిటీ సభ్యులు, కృష్ణమాచారి,కొత్తపెళ్లి రాములు, శివజి,కానుగుల స్వామి, బొలుగురు యాదగిరి, పరమాత్మ,సురేష్,గోవర్ధన్, రాము,సతీష్,శ్రవణ్,నటరాజ్, శివయోగా, దయాకర్,భరత్, తదితరులు పాల్గొనారు