మెదక్‌లో గ్యాస్ ఏజెన్సీ వద్ద రద్దీ – ముందస్తుగా సిలిండర్లు తీసుకునేందుకు పరుగులు.

తేది:14-03-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా: గ్యాస్ కొరత ఉందనే పుకార్లతో మెదక్ పట్టణంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద శనివారం ఉదయం నుంచే ప్రజలు భారీగా బారులు తీరారు. ఖాళీ సిలిండర్లతో పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఏజెన్సీ వద్దకు చేరుకుని గ్యాస్ సిలిండర్ల కోసం క్యూలో నిలబడ్డారు.
సోషల్ మీడియాలో వస్తున్న గ్యాస్ కొరతపై తప్పుడు సమాచారాన్ని నమ్మి ముందుగానే సిలిండర్లు తీసుకోవడానికి ప్రజలు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని, అవసరమైనప్పుడు మాత్రమే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని సూచించారు.
పుకార్ల కారణంగా ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో ఏజెన్సీ వద్ద రద్దీ పెరిగిందని అధికారులు తెలిపారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భారత్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, వినియోగదారులు ముందుగా గ్యాస్ బుకింగ్ చేసుకుని సుమారు వారం రోజులలో ఏజెన్సీకి వచ్చి సిలిండర్ తిసుకోవచ్చని సూచించారు. పుకార్లను నమ్మి అవసరం లేకుండా గ్యాస్ తిసుకోవద్దనీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *