ప్రియమైన విద్యార్థిని, విద్యార్థులకు విజ్ఞప్తి- కె. ఆర్. నాగరాజు.

తేది:14-03-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.

వరంగల్ జిల్లా: మీ జీవిత గమనంలో పదవ తరగతి పరీక్షలు అనేవి అత్యంత కీలకమైన మొదటి మెట్టు. ఈ పరీక్షలను చూసి భయపడకుండా, పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని కోరుకుంటున్నాను. క్రమశిక్షణతో కూడిన మీ కష్టం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రతి విద్యార్థి ఈ పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.విద్యార్థుల కోసం కొన్ని సూచనలు పరీక్ష కేంద్రానికి కనీసం 30 నుండి 45 నిమిషాల ముందు చేరుకోవడం మంచిది.
పరీక్ష ప్రారంభమైన తర్వాత 5 నిమిషాల వరకు మాత్రమే ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు. సమయం 9:30 నుండి 12:30 వరకు పరీక్షలు కొనసాగుతావి మీ హాల్ టికెట్‌ను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లండి అని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.ఆర్. నాగరాజు గారు తెలియచేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *