దుండిగల్ మునిసిపల్ సర్కిల్ కార్యాలయం లో విధులు నిర్వహిస్తున్ TPS సంజన ను సస్పెండ్ చేసిన కుత్బుల్లాపూర్ జోనల్ కమీషనర్.

తేది:12-03-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.

హైదరాబాద్ : గత నెల‌ ఫిబ్రవరి 19 వ తేదీ జరిగిన ఏసీబీ దాడుల నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సస్పెన్షన్
దుందిగల్ సర్కిల్‌లో అక్రమ లావాదేవీల ఆరోపణలు – విచారణ పూర్తయ్యే వరకు విధుల నుండి సస్పెండ్
ఏ.సి.బి దాడుల సమయంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైసర్ కు సంబంధించిన వాట్సాప్ చాట్‌లు మరియు ఇతర ఆధారాలు లభించాయని తెలిపిన అధికారులు అనధికారిక నగదు లావాదేవీలు ఆమె భర్తకు చెందిన సంస్థకు మళ్లించినట్టు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు.
ఈ చర్యలు తెలంగాణ సివిల్ సర్వీసెస్ (కండక్ట్) నిబంధనలకు విరుద్ధమని భావించి, విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సంజనను సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్న అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *