బాధిత కుటుంబానికి రూ.5,00,000/-ల LOC కాపీని అందజేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.

తేది:11-03-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.

వరంగల్ జిల్లా: హన్మకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల పరిధిలోని అర్వపల్లి గ్రామానికి చెందిన మంచాల కమల అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో అతనికి చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన రూ.5,00,000/- (ఐదు లక్షల రూపాయలు) విలువైన LOC కాపీని గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ LOC ద్వారా హైదరాబాద్ నిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదల వైద్య అవసరాల విషయంలో అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, స్థానిక శాసనసభ్యుడిగా తన దృష్టికి వచ్చే ప్రతి అనారోగ్య సమస్యపై తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.అలాగే వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేస్తూ, లక్షల రూపాయలు ఖర్చయ్యే ప్రైవేట్ ఆసుపత్రుల చికిత్సలకు వెళ్లి అప్పుల పాలుకాకుండా, ప్రభుత్వ నిమ్స్ వంటి ఆసుపత్రుల్లో తాను అందించే LOCల ద్వారా ఉచితంగా మెరుగైన వైద్యం పొందాలని సూచించారు.ఈ సందర్భంగా బాధితురాలు మంచాల కమల గారి కుటుంబ సభ్యులు, ఆపద్కాలంలో అండగా నిలిచిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తమ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో హసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, యూత్ నాయకులు జట్టి యుగేందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *