మృతుల కుటుంబాలకు పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు.

తేది:11-03-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని చౌటపల్లి గ్రామానికి చెందిన మట్టపల్లి ఉపేంద్ర దశదిన కార్యక్రమంలో గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపేంద్ర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వంగాల వెంకటేశ్వర్లు గారి తండ్రి వంగాల రామారావు అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో, ఎమ్మెల్యే నాగరాజు వారి నివాసానికి వెళ్లి పరామర్శించి మనోధైర్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *