తేది: 08-03-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నారనడానికి మల్యాల మండలం నిదర్శనంగా మారింది. ఇక్కడ పనిచేసే అధికారులు, ప్రజాప్రతినిధుల్లో అత్యధికంగా మహిళలే కావడం ఇందుకు నిదర్శనం. MRO వసంత, MPDO స్వాతి, MPO ఆమని, వైద్యాధికారి మౌనిక, కొండగట్టు ఆలయ EO రమాదేవి, మల్యాల మేజర్ GP సర్పంచ్ బొట్ల జయతో పాటు మండలంలో మరో 8 మంది మహిళా సర్పంచులు గ్రామపరిపాలనలో విధులు నిర్వర్తిస్తూ మహిళా సాధికారత దిశగా అడుగులు వేయడం విశేషం.